ఎల్ఈడి లైట్స్ అందజేసిన నాయకులు

MDK: నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట మండల పరిధిలోని పోతుల బొగుడ గ్రామానికి చెందిన యువతకి వాలీబాల్ కిట్, ఎల్ఈడి లైట్స్ ను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు చింతల కరుణాకర్ రెడ్డి బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా యువకులు ఆయనను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పెద్దిపల్లి వెంకటేష్, బట్టు రాజు, కుల్ల అనిల్ కుమార్ ఉన్నారు.