'హెచ్‌పీవీ టీకా శిబిరం విజయవంతం'
VSP: పోలీస్ స్టేడియం సమీపంలోని టెంపుల్ ఆఫ్ లెర్నింగ్ ప్యాలస్లో 9-14 ఏళ్ల పోలీస్, హోంగార్డుల ఆడపిల్లల కోసం నిర్వహించిన గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నియంత్రణ హెచ్‌పీవీ టీకా శిబిరం ఆదివారంతో ముగిసింది. నాట్కో ట్రస్ట్, లయన్స్ క్లబ్ ఆఫ్ విశాఖపట్నం చారిటబుల్ ట్రస్ట్, చైతన్య స్రవంతి సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో 600 మందికి పైగా టీకాలు వేయించుకున్నారు.