ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

NRPT: ఊట్కూరు మండల కేంద్రంలో కో-ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని తహశీల్దార్ రవి, ఎంపీడీవో కొండన్న ప్రారంభించారు. రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర అందేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏవో గణేశ్ రెడ్డి పాల్గొన్నారు.