VIDEO: మోటార్ల వైర్లు చోరీ.. వేల రూపాయల నష్టం
NLR: ఇందుకూరుపేట మండలంలో దొంగలు బీభత్సం సృష్టించారు. పంట పొలాల్లో సాగు నీటి కోసం రైతులు ఏర్పాటు చేసుకున్న విద్యుత్ మోటార్లను లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడుతున్నారు. కొత్తూరు గ్రామ పొలాల్లో ఒకే రాత్రి ఏకంగా 8 విద్యుత్ మోటార్లకు సంబంధించిన వైర్లను దుండగులు అపహరించారు. వైర్లు దొంగిలించడం వల్ల వేల నష్టం జరుగుతుందని వాపోతున్నారు.