ఉదారత చాటుకున్న మిత్రబృందం

ఉదారత చాటుకున్న మిత్రబృందం

ADB: జైనథ్ మండల కేంద్రానికి చెందిన యువకుడు చౌదరి సురేష్ 2017 సంవత్సరంలో ట్రాక్టర్ బోల్తా పడి ప్రమాదవశాత్తు మరణించాడు. వారిది నిరుపేద కుటుంబం కావడంతో 60 మంది మిత్ర బృందం కలిసి భార్య పేరున రూ.లక్ష 11 వేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ బాండ్‌ను వారి కుటుంబానికి అందించి తమ ఉదారతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో మిత్ర బృందం, గ్రామస్తులు ఉన్నారు.