శిబిరం సందర్శించిన కలెక్టర్

శిబిరం సందర్శించిన కలెక్టర్

SDPT: స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకొని ములుగు మండలం వంటిమామిడి శివారులో రాజీవ్ రహదారిపై ఏర్పాటు చేసిన ఎస్ఎస్టీ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ హైమావతి పరిశీలించారు. ఇప్పటివరకు రాజీవ్ రహదారిపై వెళ్లే 96 అనుమానిత వాహనాలను తనిఖీ చేసినట్లు సిబ్బంది కలెక్టర్‌కు వివరించారు. ప్రతి వాహనం క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ, తనిఖీ ప్రక్రియ వీడియో తీయాలని సూచించారు.