ప్రాథమిక పాఠశాలను సందర్శించిన కలెక్టర్
KNR: గట్టుబూత్కూరు మండల ప్రాథమిక పాఠశాలలోని పూర్వ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. ఇక్కడ పూర్వ ప్రాథమిక విద్య అభ్యసిస్తున్న పిల్లలతో మమేకమయ్యారు. ఆటపాటలతో కూడిన విద్యను అందించాలని, ఇందుకోసం ప్రభుత్వం నుండి వచ్చిన అన్ని ఆట వస్తువులను, పుస్తకాలను వినియోగించాలని సూచించారు.