దేవరకొండలో దొంగతనం

NLG: దేవరకొండ పట్టణంలోని హనుమాన్ నగర్ లో నివాసం ఉంటున్న కూడాల శ్రీనివాస్ ఇంట్లో శనివారం రాత్రి దొంగలు తలుపు తాళాలు పగలగొట్టి బీరువాలోని చిన్నారుల కమ్మలు, రింగులు బర్త్ డే గిఫ్టులతో పాటు 10 వేల రూ.నగదును దొంగలించినట్లు తెలిపారు. గత వారం రోజులుగా శ్రీనివాస్ ఇంట్లో లేకపోవడంతో దొంగలు దొంగతనానికి పూనుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేస్తున్నారు.