VIDEO: జమ్మలమడుగులో అనధికార పవర్ కట్స్
KDP: జమ్మలమడుగులో మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో అటు వ్యాపారస్తులు, ఇటు సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముందస్తు సమాచారం లేకుండా 3 గంటలు సరఫరా నిలిపేశారని కొందరు వాపోయారు. దీనిపై విద్యుత్ శాఖ అధికారులను వివరణ కోరగా మోరగుడి దగ్గర మరమ్మతుల నేపథ్యంలో సరఫరాను నిలిపేశామన్నారు.