రామప్ప దేవాలయాన్ని సందర్శించిన విదేశీయులు

రామప్ప దేవాలయాన్ని సందర్శించిన విదేశీయులు

MLG: ములుగు జిల్లా పాలంపేట రామప్ప దేవాలయాన్ని రష్యా, అమెరికా, బ్రిటన్, జర్మనీ, థాయిలాండ్ కి చెందిన 25 మంది విదేశీయులు సందర్శించారు. రామప్ప రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం వారికి ఆలయ చరిత్ర, శిల్పకళా వైభవాన్ని టూరిజం గైడ్ తాడబోయిన వెంకటేష్ వివరించారు. ఆలయాన్ని దర్శించుకోవడంతో మంచి అనుభూతి పొందామని పర్యాటకులు తెలిపారు.