శ్రీశైలం మల్లన్న సన్నిధిలో చోరీ

శ్రీశైలం మల్లన్న సన్నిధిలో చోరీ

AP: శ్రీశైలం మల్లన్న సన్నిధిలో ఈ నెల 1న ఉదయం 10:57 గంటల సమయంలో చోరీ జరిగింది. దుండగులు స్వామివారి గర్భగుడి ఎదుట ఉన్న క్లాత్ హుండీని కోసి కొంత డబ్బును దొంగిలించారు. ఈ క్రమంలో సీసీకెమెరా ఆధారంగా నిన్న నిందితులను గుర్తించారు. ఉచిత దర్శనం క్యూలైన్ వద్ద నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.10,150 స్వాధీనం చేసుకొని కోర్టుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.