VIDEO: వాగు ఉధృతి.. రాకపోకలు బంద్

SRPT: మోతె మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, చెరువులు అలుగు పోస్తున్నాయి. దీంతో విభళాపురం నుంచి మామిళ్లగూడెం వెళ్లే రహదారిపై ఉన్న వంతెన పైనుంచి నీరు ప్రవహిస్తుంది. ప్రమాదకరంగా వాగు ప్రవహిస్తుండడంతో అధికారులు రాకపోకలను నిషేధించారు. ఈ రహదారిపై నిత్యం 10 గ్రామాల ప్రజలు వెళ్తుంటారు. అధికారులు దీనికి పరిష్కారం చూపించాలని స్థానికులు కోరుతున్నారు.