'బొర్రాగుహలకు రూ.10 లక్షలు కేటాయించాలి'

'బొర్రాగుహలకు రూ.10 లక్షలు కేటాయించాలి'

అల్లూరి: అనంతగిరి మండలం బొర్రా గుహలో ప్రతీ ఏటా నిర్వహించే మహాశివరాత్రి ఉత్సవాలకు టూరిజం శాఖ 10లక్షల రూపాయలు కేటాయించాలని స్థానికులు గురువారం డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా సర్పంచ్, ఎంపీటీసీలు మాట్లాడుతూ.. బొర్రా గుహలు ఉత్సవాలకు సంబంధించి టూరిజం శాఖకు నివేదికను సమర్పించినప్పటికీ నేటికీ స్పందించలేదని, మూడు రోజుల గడువులోపు స్పందించకపోతే బొర్రా గుహలను ముట్టడి చేస్తామని అన్నారు.