'కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి'
SRD: రైతులు పండించిన పంటలకు ప్రభుత్వ మద్దతు ధరతో అందుబాటులో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినట్లు PACS ఛైర్మన్, DCCB డైరెక్టర్ గుండు వెంకట్ రాములు అన్నారు. బుధవారం బొక్కస్ గాం PACS ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ మేరకు రైతుల మొక్కజొన్న బస్తాలను తూకం చేశారు. అందుబాటులో కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.