మాజీ భార్యలపై ఆమిర్ ఖాన్ వ్యాఖ్యలు

మాజీ భార్యలపై ఆమిర్ ఖాన్ వ్యాఖ్యలు

తన మాజీ భార్యలు రీనా, కిరణ్‌లపై బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'నేను నిజంగా చాలా లక్కీ పర్సన్‌ని. నా జీవితంలోకి వచ్చిన రీనా, కిరణ్ అద్భుతమైన వ్యక్తులు. మేము భార్యాభర్తలుగా విడిపోయామే తప్ప మనుషులుగా విడిపోలేదు. నా మనసులో వారికి గౌరవం, ప్రేమ ఎప్పుడూ ఉంటాయి. మాది ఇప్పటికీ ఒకే ఫ్యామిలీ. అందరం కలిసి మెలిసి ఉంటాం' అని తెలిపాడు.