మార్కెట్ వసూళ్లలో మైదుకూరుకు ప్రథమ స్థానం!
కడప: మైదుకూరు మార్కెట్ కమిటీ వసూళ్లలో జిల్లాలో ప్రథమ స్థానంలో నిలవడం సంతోషకరమని, ప్రతి ఒక్కరి కృషితోనే సాధ్యపడిందని మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోగు భరత్ అన్నారు. జిల్లాలో అత్యధికంగా రూ.2.33 కోట్ల వసూలవ్వడంతో సిబ్బంది కృషి ఉందని అన్నారు. మైదుకూరు మార్కెట్ యార్డ్‌లో మరిన్ని సదుపాయాలు కల్పించి రైతులకు మెరుగైన సేవలు అందిస్తామని అన్నారు.