VIDEO: పురపాలికలో కాంగ్రెస్ జైత్రయాత్ర: ఎమ్మెల్యే
WNP: మున్సిపాలిటీ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీ సాధించిందని ఎమ్మెల్యే మేఘారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 33 వార్డుల్లో 22 వార్డులను గెలుచుకుని పాలనా బాధ్యతలు చేపట్టామన్నారు. నూతన పుర ఛైర్‌పర్సన్ మాధవి, వైస్ ఛైర్మన్ మధుసూదన్ ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇకపై ప్రతి వారం ఒక వార్డులో పర్యటించి స్థానిక సమస్యలను పరిష్కరించాలని కోరారు.