VIDEO: 'మాజీ ఎమ్మెల్యే అసత్యాలు ప్రచారం చేస్తున్నారు'
E.G: ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎదుగుదలను చూసి మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ఓర్వలేకపోతున్నారని బీజేపీ అనపర్తి మండల అధ్యక్షుడు కర్రి బుల్లి రెడ్డి అన్నారు. అనపర్తి కూటమి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే నల్లమిల్లి బీజేపీ, జనసేన నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు సరికాదు అన్నారు.