ఈనెల 18న కార్గో వస్తువులకు వేలం
ADB: ఆదిలాబాద్ డిపోలోని కార్గోలో వినియోగదారులు తీసుకువెళ్లని వస్తువులకు ఈనెల 18న వేలం నిర్వహిస్తున్నట్లు ఆదిలాబాద్ RTC డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 18న ఉదయం 11 గంటలకు డిపో ఆవరణలో వేలం ప్రారంభమవుతుందన్నారు. ఆసక్తి ఉన్నవారు వేలంలో పాల్గొని వస్తువులను కొనుగోలు చేయవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.