'ఆపరేషన్ సింధూర్'.. కర్ణాటక కాంగ్రెస్ వివాదాస్పద పోస్ట్

పాక్ ఉగ్రస్థావరాలపై 'ఆపరేషన్ సింధూర్' అంటూ భారత ఆర్మీ దాడులు చేసింది. అయితే దీనిపై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో కర్ణాటక కాంగ్రెస్ వివాదాస్పద ట్వీట్ చేసింది. దాడులపై స్పందిస్తూ గాంధీ ఫొటోతో పాటు 'మానవాళికి అత్యంత శక్తివంతమైన ఆయుధం శాంతి' అని ఎక్స్‌లో పోస్టు చేసింది. దీనిపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.