జిల్లాలో రౌడీషీటర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్
ATP: జిల్లా ఎస్పీ పి.జగదీష్ IPS గారి ఆదేశాల మేరకు పోలీసు శాఖ జిల్లా వ్యాప్తంగా రౌడీషీటర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించింది. శాంతి–భద్రత కోసం సక్రమ ప్రవర్తన అవసరమని అధికారులు వారికి అవగాహన కల్పించారు. ఇకపై ఏవైనా అక్రమ, అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమాజంలో సానుకూల మార్పుతో ముందుకు సాగాలని సూచించారు.