నేడు టీడీపీ కార్యాలయానికి సీఎం రాక
GNTR: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు ఇవాళ రానున్నారు. ముందుగా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమంలో పాల్గొని, అనంతరం అందుబాటులో ఉన్న నేతలతో సమావేశం కానున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ రాష్ట్ర కమిటీపై సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.