మరణించిన వానరానికి దహన సంస్కారాలు
WGL: ఖిలావరంగల్ మండలం బొల్లికుంట క్రాస్ రోడ్ వద్ద సోమవారం రోడ్డు ప్రమాదంలో ఓ కోతి మరణించింది. విషయం గమనించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాయపురం సాంబయ్య హిందూ సాంప్రదాయ ప్రకారం ఆ వానరానికి దహన సంస్కారం చేసారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ సిబ్బంది సహాయంతో దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఐనవోలు మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎలీషా, తదితరులున్నారు.