వర్కింగ్ ఉమెన్ హాస్టల్‌కు శంకుస్థాపన
VSP: మధురవాడ సమీపంలోని శివశక్తినగర్‌లో రూ.26.12 కోట్లతో వర్కింగ్ ఉమెన్ హాస్టల్ నిర్మాణానికి జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మంగళవారం శంకుస్థాపన చేశారు. 1.46 ఎకరాల్లో జి+4 విధానంలో నిర్మించనున్న ఈ హాస్టల్‌లో 96 గదులతో 248 మంది మహిళలకు తక్కువ ధరలో వసతి కల్పించనున్నట్టు తెలిపారు.