అమెరికా విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
ఇరాన్‌పై యుద్దం నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు చేశారు. అనుకున్న దానికంటే ముందుగానే మరికొన్ని వారాల్లో ఆ దేశంపై దాడులు ముగిస్తామన్నారు. టెహ్రాన్‌పై భూతల దాడులు చేయకుండానే అనుకున్న లక్ష్యాలను సాధించగలమని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రెండు వారాల్లో తమ దాడులు పూర్తయ్యేసరికి టెహ్రాన్ చరిత్రలో ఎన్నడూ లేనంత బలహీనంగా మారిపోతుందన్నారు.