పాఠశాలల్లో ఎంఈవో ఆకస్మిక తనిఖీ
NGKL: లింగాల మండలంలోని సురాపూర్, మగ్దూంపూర్ ప్రాథమిక పాఠశాలలను ఎంఈవో అహ్మద్, ఎంపీడీవో చంద్రశేఖర్ శనివారం సంయుక్తంగా తనిఖీ చేశారు. పాఠశాల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు, తరగతి గదులకు వెళ్లి విద్యార్థుల చదువు సామర్థ్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని, విద్యార్థుల అభ్యసన నైపుణ్యాలను మెరుగుపరచాలని సూచనలు చేశారు.