వెంకన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే అశోక్

వెంకన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే అశోక్

ప్రకాశం: గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పట్టు వస్త్రాలతో స్థానిక టీడీపీ నాయకులతో కలిసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని, అర్చకులు అందించిన తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని, సీఎం చంద్రబాబు ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు.