కాఫీ కార్మికుల సమస్యల పరిష్కారానికి సిద్ధం
కాఫీ కార్మికుల సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉన్నామని కాఫీ తోటల విభాగం ఛైర్మన్, ఏపీ ఎఫ్‌డీసీ ఎండీ డాక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. శుక్రవారం చింతపల్లి, పాడేరు మండలాల్లో పర్యటించారు. మినుములూరులో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎల్.సుందరరావు, కార్మిక సంఘం నేతలు, పలువురు కాఫీ కార్మికులతో సమావేశం నిర్వహించారు. కూలి రేట్లు, పండ్ల సేకరణ రేట్లు పెంచామన్నారు.