కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి మంత్రి తుమ్మల ఫోన్

TG: కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫోన్ చేశారు. యూరియా సరఫరా చేసేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. రాష్ట్రానికి త్వరగా యూరియా అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా యూరియా కోసం రైతులు షాపుల ముందు పడిగాపులు పడుతున్న విషయం తెలిసిందే.