పోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు కీలక తీర్పు

పోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు కీలక తీర్పు

TG: హైదరాబాద్ పోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 9 ఏళ్ల బాలికపై లైంగిక దాడి కేసులో ఇద్దరు దోషులకు జైలుశిక్ష విధించింది. దోషులు మహమ్మద్‌కు 30 ఏళ్లు, ఇషాక్ ఖాన్‌కు 25 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. అదేవిధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇద్దరు దోషులకు జరిమానాలు విధించింది. బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.