కొల్లిపరలో వాహన మిత్రకు దరఖాస్తుల స్వీకరణ
GNTR: కొల్లిపర మండలంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో వాహన మిత్ర పథకం కింద అర్హులైన ఆటో, క్యాబ్ డ్రైవర్ల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఎంపీడీవో విజయలక్ష్మీ బుధవారం తెలిపారు. డ్రైవర్లు తమ గుర్తింపు కార్డులు, దరఖాస్తు పత్రంతో ఈ నెల 19వ తేదీలోగా దగ్గరలోని సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్‌కు దరఖాస్తులను అందజేయాలని సూచించారు.