కామేపల్లిలో రైతు సంఘం ధర్నా

KMM: రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయాలని, యూరియా సకాలంలో అందించాలంటూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలో రైతులు ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం, వ్యవసాయ శాఖ కార్యాలయం ఎదుట వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు చలపతిరావు, రైతు సంఘం కార్యదర్శి బొంతు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.