ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే
RR: చేవెళ్ల నియోజకవర్గం, కేశపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య స్థానిక నాయకులు తో కలిసి ప్రారంభించారు. పేదింటి సొంతింటి కల ప్రజా ప్రభుత్వంలోనే సాధ్యమని అన్నారు. ప్రజా ప్రభుత్వంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు. అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.