వైఎస్ షర్మిలా రెడ్డితో ఇర్ఫాన్ బాషా భేటీ

KDP: విజయవాడ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డితో ప్రొద్దుటూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ఇర్ఫాన్ బాషా భేటీ అయ్యారు. ప్రొద్దుటూరు నియోజకవర్గ సమస్యలపై చర్చించారు. ప్రొద్దుటూరులో ఆగిపోయిన అభివృద్ధి పనుల గురించి అలాగే ప్రొద్దుటూరుకు అవసరమైన అభివృద్ధి పనుల గురించి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళాలని కోరారు.