ఏల్చూరులో రోడ్డు ప్రమాదం.. పలువురికి గాయాలు

ఏల్చూరులో రోడ్డు ప్రమాదం.. పలువురికి గాయాలు

ప్రకాశం: సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామంలో శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకొంది. స్థానికుల వివరాల మేరకు.. హైదరాబాద్ నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న కారు గ్రామంలోకి వచ్చిన తరువాత అదుపుతప్పి ఓ ఇంటి గోడను ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు అంబులెన్స్‌లో నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు.