నేడు వరంగల్ ఎనుమాముల మార్కెట్‌కు సెలవు

నేడు వరంగల్ ఎనుమాముల మార్కెట్‌కు  సెలవు

WGL: ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు నేడు (బుధవారం) సెలవు ప్రకటిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బుధవారం నూతన సంవత్సరం సందర్భంగా సెలవు ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. తిరిగి గురువారం మార్కెట్ యథావిధిగా ప్రారంభమవుతుందన్నారు. రైతులు విషయాన్ని గమనించి నేడు సరుకులు తీసుకొని రావద్దని సూచించారు.