ఏబీఎన్ రాధాకృష్ణపై గుంటూరులో ఫిర్యాదు

ఏబీఎన్ రాధాకృష్ణపై గుంటూరులో ఫిర్యాదు

గుంటూరు: మాజీ సీఎం వైఎస్ జగన్‌పై అసత్యాలు ప్రచారం చేసిన ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని గుంటూరు నగర వైసీపీ అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా డిమాండ్ చేశారు. ఇదే అంశంపై గురువారం పాత గుంటూరు పోలీస్ స్టేషన్లో పలువురు వైసీపీ శ్రేణులతో కలిసి ఫిర్యాదు చేశారు. రాధాకృష్ణ మహిళా సమాజానికి కూడా క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో న్యాయస్థానాలను ఆశ్రయిస్తామన్నారు.