రోడ్డు, బ్రిడ్జి కష్టాలు తీరుస్తా: ఎమ్మెల్యే

రోడ్డు, బ్రిడ్జి కష్టాలు తీరుస్తా: ఎమ్మెల్యే

NRML: భైంసా రూరల్ పరిధి కుంసర గ్రామం నుంచి భైంసా వెళ్లే రోడ్డు, బ్రిడ్జి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తానని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ హామీ ఇచ్చారు. కుంసరలో రూ.10 లక్షలతో మహిళా భవనానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యమని, పెండింగ్‌లో ఉన్న ఆలయ పనులను పూర్తి చేస్తానని తెలిపారు. సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానని అన్నారు.