'సీపీఐ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి'

'సీపీఐ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి'

VZM: బొబ్బిలిలో జులై 26, 27న జరగనున్న సీపీఐ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని పార్టీ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ కోరారు. బొబ్బిలి మండలం బొడ్డవలసలో ఆదివారం శాఖ మహాసభ నిర్వహించారు. పేదల పక్షాన నిరంతరం సీపీఐ పోరాటం చేస్తుందని చెప్పారు. భూమి, ఇళ్ల స్థలాలు లేని పేదలకు భూమి, ఇళ్ల స్థలాలు ఇప్పించినట్లు చెప్పారు. మహాసభలకు తరలి రావాలని కోరారు.