వినతులు సమయానికి పరిష్కరించాలి
SKLM: మందస మండలంలోని నర్సింగు పురం, జిల్లుండా గ్రామ సచివాలయంను శనివారం ఎమ్మెల్యే గౌతు శిరీష ఆకస్మికంగా సందర్శించారు. సచివాలయ సిబ్బంది హాజరు పట్టికలను పరిశీలించిన ఆమె, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి అందిన వినతులను సమయానికి పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. గ్రామ ప్రజలకు వేగవంతమైన సేవలందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె అన్నారు.