మా బాధలు ప్రభుత్వానికి పట్టదా?
ASR: అనంతగిరి మండలం ఎన్ఆర్ పురం పంచాయతీ, లివిటి గ్రామంలో అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నమని గిరిజనులు తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వాలు ఎన్ని మారినా మా గ్రామాలకు రోడ్డు మంచినీటి సదుపాయం కల్పించట్లేదని వాపోయారు. తాగడానికి నీరు దొరకడం లేదని ఈ వర్షాకాలంలో వర్షపు నీళ్లు త్రాగి అనేకమంది ప్రజలు అనారోగ్యం పాలవుతు న్నారన్నారు.