‘చంద్రబాబు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు?’
AP: చట్టసభల్లో ఓబీసీ రిజర్వేషన్ల కోసం అఖిలపక్ష సమావేశం జరిగిందని మాజీమంత్రి జోగి రమేష్ అన్నారు. ఓబీసీ రిజర్వేషన్లపై పార్లమెంట్‌లో ప్రైవేట్ బిల్లు పెట్టిన పార్టీ వైసీపీ అని చెప్పారు. దీని కోసం వైసీపీ కట్టుబడి ఉందని తెలిపారు. ఓబీసీ రిజర్వేషన్లకు చంద్రబాబు అనుకూలమా? వ్యతిరేకమా? అని నిలదీశారు. దీనిపై చంద్రబాబు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు.