VIDEO: బాబా సేవలు వెలకట్టలేనివి: ఎంపీ
కోనసీమ: ముమ్మిడివరంలో ఆదివారం జరిగిన శ్రీ సత్య సాయి బాబా శత జయంతి వేడుకలో అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్, స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజాసేవకుడిగా సత్యసాయి అందించిన సేవలు వెలకట్టలేనివని అన్నారు. ముఖ్యంగా విద్య, వైద్యరంగంలో ఆయన నిస్వార్ధంగా సేవలందించారని, ఆయన చేసిన కృషి భావితరాలకు ఆదర్శం అన్నారు.