భయపెడుతున్న గ్రామ సింహాలు

భయపెడుతున్న గ్రామ సింహాలు

ప్రకాశం: మార్కాపురంలో గ్రామ సింహాల( వీధి కుక్కల) బెడద ఎక్కువైపోయిందని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని తర్లుపాడు ప్రధాన రోడ్డు, పూల సుబ్బయ్య కాలనీ, అర్బన్ హెల్త్ సెంటర్ ప్రాంతాలలో కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతూ అటుగా వెళ్లే పాదచారులను, ద్విచక్ర వాహనదారులను, చిన్న పిల్లలపై దాడులు చేస్తున్నాయని పట్టణ ప్రజలు తెలియజేశారు.