28 క్వింటాల పత్తిని దగ్ధం చేసిన దుండగులు

28 క్వింటాల పత్తిని దగ్ధం చేసిన దుండగులు

భువనగిరి: చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో మార్గం శివయ్య అనే రైతు ఇంట్లో 28 క్వింటాళ్ల పత్తిని గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. సుమారు రూ. 3 లక్షల వరకు నష్టం వాటిల్లింది. తనను ఆదుకోవాలని బాధిత రైతు మార్గం శివయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.