ఉత్తమ ఉపాధ్యాయుడికి సత్కారం
E.G: రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, కొంతమూరు ఎంపీపీ స్కూల్ ఉపాధ్యాయుడు ఉమామహేశ్వరరావు నాయుడును కాకినాడకు చెందిన చేయూత స్వచ్ఛంద సంస్థ సత్కరించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు మంత్రి వాసంశెట్టి సుభాశ్, ఎమ్మెల్సీ పేరా బత్తుల రాజశేఖర్, ఎంపీ శ్రీనివాస్, ఎమ్మెల్యే కొండబాబు అతిధులుగా పాల్గొన్నారు. ఉమామహేశ్వరరావు సేవలను వారు కొనియాడారు.