డివైడర్‌ను ఢీకొని యువకుడు మృతి

డివైడర్‌ను ఢీకొని యువకుడు మృతి

ADB: బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన రోల్ మామడ సమీపంలోని టోల్ ప్లాజా వద్ద మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. నేరడిగొండ మండలం బుద్ధికొండ గ్రామానికి చెందిన లక్ష్మణ్ హోలీ పండుగ వేళ తన స్వగ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా అతను ప్రయాణిస్తున్న బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.