రేపు అమరవీరులను స్మరిస్తూ సైకిల్ ర్యాలీ

రేపు అమరవీరులను స్మరిస్తూ సైకిల్ ర్యాలీ

WGL: శాంతి భద్రతల కోసం ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరులను స్మరిస్తూ ఈనెల 29న సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి ప్రారంభం అయ్యే ఈ సైకిల్ ర్యాలీలో యువతీ, యువకులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొని అమరవీరులకు నివాళులర్పించాలని కోరారు. కాగా, నేడు జరగాల్సిన ఈ ర్యాలీ రేపటికి వాయిదా పడింది.