VIDEO: 'విద్యార్థులకు ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది'
SKLM: విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. బుధవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో నూతన తరగతి గదులు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్రమంత్రి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. రూ .99 లక్షలతో అదనపు భవనాలను నిర్మించామని తెలిపారు.