'సర్కార్ 4'పై RGV క్రేజీ అప్‌డేట్

'సర్కార్ 4'పై RGV క్రేజీ అప్‌డేట్

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన సూపర్ హిట్ పొలిటికల్ క్రైమ్ ఫ్రాంచైజీ 'సర్కార్ 4' షూటింగ్‌ను వచ్చే నెలలో ప్రారంభించనున్నట్లు ప్రకటించాడు. ముంబైలో జరిగిన రెడ్ లారీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించాడు. దీనితో పాటు 'సిండికేట్' అనే మరో సినిమాపై కూడా పని చేస్తున్నట్లు చెప్పాడు. స్టీవెన్ స్పీల్‌బర్గ్ తన ఆల్ టైమ్ ఫేవరెట్ దర్శకుడని వర్మ పేర్కొన్నాడు.